-crocodile-attack

ఓ భారీ మొసలి ఉందని తెలియకపోవడంతో..

ఆస్ట్రేలియా: భారీ మొసలి మహిళపై దాడి చేసిందని అధికారులు తెలిపారు. దాదాపు 9 అడుగుల పొడవున్న మొసలి దాడి చేయడంతో ఘటన స్థలంలోనే ఆమె ప్రాణాలు కొల్పోయిందని వారు చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అర్హెమ్ ల్యాండ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. డార్విన్ అనే ప్రాంతం నుంచి 500కి.మీ.ల దూరంలో ఉన్న నేషనల్ పార్కుకు ఆ మహిళ తన కుటుంబసభ్యులతో కలిసి విహరయాత్రకు వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో అక్కడున్న ఓ సరస్సులో వారు ఈత కొడుతుండగా మొసలి వారిపై దాడి చేసిందన్నారు. ప్రమాదంలో ఆమె చనిపోయిందన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తాము అక్కడికి చేరుకున్నామని అధికారులు తెలిపారు. అయితే అప్పటికే దారుణం జరిగిపోయిందన్నారు. ఇదిలావుండగా  నేషనల్ పార్కులో ఉన్న సరస్సులో మొసలి ఉందని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చనిపోయిన మహిళ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.