TRS-Kuwait-celebrations

కువైట్‌లో ఘనంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం..

కువైట్: టీఆర్‌ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కువైట్‌లో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. టీఆర్‌ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కువైట్‌లోని తెలంగాణ వాసులు ఎంతోమంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులైన అనేకమంది ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పిన అభిలాష.. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. కువైట్‌లో సమస్యలు ఎదుర్కొన్న అనేకమంది తెలంగాణ వాసులను ఆదుకోవడంలో పార్టీ సభ్యుల క‌ృషిని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అభిలాషతోపాటు టీఆర్‌ఎస్ కమిటీ సభ్యులు కొండల్ రెడ్డి, సురేష్ గౌడ్, రవి గన్నారపు, రమేష్ ఓరుగంటి, దివ్యరవి గరినే, ప్రమోద్, సయీద్ రెహమాన్, రాయిస్ తదితరులు పాల్గొన్నారు.