Kuwait-cops-hunt-expats

వలసదారుల వేటలో కువైట్ పోలీసులు.. బహిష్కరణే లక్ష్యం..?

కువైట్: కువైట్‌లో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. వారందరినీ వేటాడే పనిలో పడ్డారు. ప్రస్తుత కువైట్‌లో సుమారు లక్షా ఇరవై వేలమంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారని అంచనా. కువైట్‌లో నివాసం ఉంటున్న వారిలో చాలామంది ధ్రువీకరణ పత్రాల గడువు ముగిసిందని, వారు వాటిని పునరుద్ధరించుకోలేదని అధికారులు చెప్పారు. సందర్శన కోసం విజిటింగ్ వీసాలతో దేశంలోకి ప్రవేశించిన వారు కూడా తిరిగి వెళ్లలేదని, అలాంటి వారందరినీ పట్టుకొని కువైట్ నుంచి బహిష్కరించనున్నట్లు వారు చెప్పారు.