Kuwait-bans-expats

ఈ ఇరవై దేశాల వలసదారులు.. కువైట్‌లో అడుగుపెట్టకూడదు..

కువైట్:ప్రపంచంలోని చాలా దేశాల నుంచి ఎంతోమంది సామాన్యులు పని కోసం కువైట్ గడప తొక్కుతుంటారు. ఇలా వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే ఈ వలసలను అరికట్టేందుకు కువైట్ ప్రభుత్వం తాజాతా ఓ నిర్ణయం తీసుకొంది. ఇథియోపియా, బుర్కినా ఫాసో, భూటాన్, గినియా, గినియా బిసో దేశాల నుంచి వలసలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్రికాలోని డిజిబౌటి, కెన్యా, ఉగాండా, నైజీరియా, టోగో, సెనెగల్, మలావి, చాడ్, సియరా లియోన్, నైజర్, టాంజానియా, గాంబియా, ఘనా, జింబాబ్వే, మడగాస్కర్ దేశాల నుంచి వచ్చే వలసదారులపై కువైట్ ఇంతకుముందే నిషేధం విధించింది. తాజా నిర్ణయంతో వలసల విషయంలో కువైట్ నిషేధం ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య ఇరవైకి చేరింది. ఈ ఐదు దేశాలేకాక, కామెరూన్, కాంగో, బురుండి, ఎరిట్రియా, లైబీరియా దేశాల నుంచి వచ్చే వలసదారులపై కూడా తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు కువైట్ ప్రకటించింది.