Kreeda-sanchaya-in-Kuwait

కువైట్‌ను హోరెత్తించిన ప్రవాసీలు.. అంగరంగవైభవంగా ‘క్రీడా సంచయం’..

కువైట్: కువైట్‌లోని కన్నడిగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘క్రీడా సంచయ’ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఇక్కడి కర్ణాటక వాసులందరికీ ఓ చక్కని వీడియో సందేశం ద్వారా ఆహ్వానం పంపిన నిర్వాహకులు ఎక్కడా తగ్గకుండా.. కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా ముగించారు. కువైట్ నగర శివార్లలోని వాఫ్రా ఫాంహౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆహ్లాదంలో ముంచెత్తింది. దీనిలో భాగంగా ఎన్నో అవుట్‌డోర్, ఇండోర్ ఆటలను నిర్వహించారు. కువైట్ కన్నడ కూటమిలో సభ్యులైన కన్నడిగులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. మార్చి 22న జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల కోసం క్విజ్, అంత్యాక్షరి వంటి పోటీలను కూడా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హోలీ పండుగను కూడా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులకు కమిటీ మీడియా ప్రతినిధి, పబ్లిక్ రిలేషన్స్ అధికారి జయలక్ష్మి కర్కల్ కృతజ్ఞతలు తెలియజేశారు.