Worker-Saving-Fallen-Man-From-Approaching-Train

చావును కళ్లారా చూశాడు.. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు

శాక్రమెంటో: అమెరికాలో ఓ వ్యక్తి చావును కళ్లారా చూసి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడ్డాడు. కాలిఫోర్నియాలో గత ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకూ అక్కడ ఏం జరిగిందంటే.. ఫుల్లుగా మందుకొట్టిన ఓ వ్యక్తి తూలుతూ ఫ్లాట్‌ఫాంపైకి వచ్చాడు. అటూఇటూ స్టెప్పులేసుకుంటూ నేరుగా రైల్వే ట్రాక్‌పై పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో రైలు వేగంగా ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుండటంతో తోటి ప్రయాణికులు షాకై అలానే చూస్తుండిపోయారు. జాన్ కానర్ అనే ఉద్యోగి మాత్రం చాకచక్యంగా రెప్పపాటులో స్పందించాడు. ట్రాక్‌పై పడ్డ వ్యక్తిని సెకన్లలో ప్లాట్‌ఫాంపైకి లాగి అతడి ప్రాణాలను కాపాడాడు. వీడియోను గమనించినట్లయితే.. జాన్ కానర్ ఆ వ్యక్తిని కాపాడటంలో సెకను ఆలస్యం అయినా.. ఆ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసి ఉండేవి. కానర్ సమయస్ఫూరికి ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సైతం జాన్ కానర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Video Source: Viral Strong