women-nude-on-the-bed-then-

బెడ్‌పై మహిళ న్యూడ్‌గా పడి ఉంది.. రెండుగంటలపాటు..

ఫ్లోరిడా: తాను దేవుడిని ప్రార్థిస్తే ఎటువంటి సమస్యలైనా దూరమవుతాయని ఓ వ్యక్తి మహిళను నమ్మించాడు. ఆమె కష్టాల్లో ఉండటంతో అతడి మాటలు నమ్మింది. శనివారం సాయంత్రం తన ఇంటికి రావాలని ఆమెను అతడు ఆహ్వనించాడు. చెప్పినట్లుగానే సాయంత్రం అతడికి ఇంటికి చేరుకుంది. ఇంటికొచ్చిన ఆమెకు అతడు టీ ఆఫర్ చేశాడు. అయితే దాదాపు రెండు గంటల దాకా ఆమె స్పృహ కోల్పోయింది. బెడ్‌రూమ్‌లో ఆమె న్యూడ్‌గా పడి ఉంది. స్పృహలోకి రాగానే జరిగిన దారుణం ఆమెకు అర్థమైంది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ఆమె తన ఇంటికి వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీన్ ఫిలిప్స్ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేశాడని పోలీసులు తెలిపారు. టీలో మత్తుమందు కలిపి ఈ దారుణానికి పాల్పడ్డాడని వారు చెబుతున్నారు. గతంలోనూ ఇలానే కొంతమంది మహిళలపై అతడు లైంగికదాడి చేశాడని వారు తెలిపారు. జీన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు.