women-could-face-death-penalty

మహిళలు అబార్షన్ చేయించుకుంటే..

టెక్సాస్: గర్భం దాల్చిన మహిళలు ఉద్దేశపూర్వకంగా అబార్షన్ చేయించుకుంటే వారికి మరణశిక్ష విధించేలా ప్రభుత్వం త్వరలోనే ఓ చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ఇటీవల టెక్సాస్‌లో గర్భం దాల్చిన మహిళలు వివిధ కారణాలతో అబార్షన్‌లు చేయించుకుంటున్నారు. దాంతో అబార్షన్‌ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తుందని అధికారులు తెలిపారు. గర్భంలోని శిశువు చంపే అధికారం ఎవ్వరికీ లేదని వారు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి కాకుండానే టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చుతున్నారు. వారు వివిధ రకాల భయాలతో గర్భాన్ని తొలగించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. అబార్షన్ చేయించుకునే మహిళకే కాకుండా అబార్షన్ చేసే డాక్టర్‌లు కూడా శిక్ష అనుభవించాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు.