Utah-woman-died-after-pharmacy-gave-her-wrong-medication-lawsuit-states

ఒక మాత్రకు బదులు.. ఆ మహిళకు మరో టాబ్లెట్ ఇచ్చారు.. అంతే..

ఊతా: ఫార్మసీలో ఒక టాబ్లెట్ బదులు వేరొక టాబ్లెట్ ఇవ్వడంతో 75 ఏళ్ల వృద్దురాలు మరణించిందంటూ ఊతాకు చెందిన ఓ కుటుంబం కోర్టులో దావా వేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్లోరియా డన్(75) అనే వృద్దురాలు ఎంతో బాధపడుతూ 2018 జులైలో మరణించింది. ఆమె మీథోట్రెక్సేట్ అనే ప్రమాదకరమైన కీమోథెరపీ మందులను అధిక మోతాదులో తీసుకోవడం వలనే చనిపోయిందని డాక్టర్ ఆమె కుటుంబసభ్యులకు తెలిపారు. ఆమె సహజమైన డైయూరేటిక్ మందులనే వాడుతుందని.. ఫార్మసీలో తప్పుడు మందులు ఇవ్వడం వల్లే ఇలా జరిగినట్టు కుటుంబసభ్యులకు, డాక్టర్లకు దాదాపు వారం తరువాత తెలిసింది. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు ఫార్మసీలోని ఉద్యోగులపై దావా వేశారు. తమ తల్లి కనీసం ఎందుకు చనిపోతున్నాననే విషయం కూడా తెలీకుండా ఎంతో బాధతో చనిపోయిందని ఆమె పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ ఉద్యోగులు తెలీక ఈ తప్పు చేసి ఉండచ్చని.. కానీ ఇలాంటి తప్పు మరొకరికి జరగకూడదంటే కేసు పెట్టడమే న్యాయమని మృతురాలి పిల్లలు పేర్కొన్నారు.