US-man-wins-500000-dollars-from-lottery

సరదాగా ట్రై చేశాడు.. ఒక్క దెబ్బకు కోటీశ్వరుడైపోయాడు..!

మిచిగాన్: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో చెప్పలేం. అదృష్టం ఉండాలే కాని.. రాత్రి భోజనానికి కూడా డబ్బులు లేనివాడు ఉదయానికి కోటీశ్వరుడు అయిపోవచ్చు. అమెరికాలో ఓ వ్యక్తికి ఇలానే అదృష్టం వరించింది. తన జీవితంలో లాటరీ ముఖాన్నే చూడని ఓ వ్యక్తి.. జీవితంలో మొదటిసారి లాటరీ కొనడం.. అందులో కోట్ల రూపాయల లాటరీ తగలడం.. అంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.  

అసలు ఈ లాటరీ ఎలా తగిలిందంటే.. మిచిగాన్‌కు చెందిన వ్యక్తి వేరే ప్రదేశంలో ఉంటున్న తన తల్లిని చూడటానికని బయల్దేరాడు. దారిలో ఓ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆ వ్యక్తి ఆగినప్పుడు గోల్డ్ కోటింగ్‌తో ఉన్న లాటరీ టికెట్లు తన కంటిని ఆకర్షించాయి. అంతే.. ఓ ట్రైల్ వేద్దామనుకుని లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి స్క్రాచ్ చేశాడు. తన లాటరీ టికెట్‌లో ఉన్న నెంబరును అక్కడున్న నెంబర్లతో పోల్చి చూశాడు. 
 
తన నెంబర్‌తో 5 లక్షల డాలర్ల(రూ. 3 కోట్ల 50 లక్షలు) ప్రైజ్ చూశాడు. మొదట నమ్మలేక.. మూడుసార్లు మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఒకే నెంబర్ అవడంతో.. తాను 5 లక్షల డాలర్లు గెలిచానంటూ ఎగిరి గెంతేశాడు. తాను కోటీశ్వరుడయ్యాననే విషయం అర్థమైన ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేవు. గెలిచిన డబ్బుతో కొత్త కారు కొంటానని, వివిధ ప్రదేశాలకు తిరుగుతానని, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటానని ఆ 46 ఏళ్ల అదృష్టవంతుడు తెలిపాడు.