Ugadi-Celebrations-in-Dallas

టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

త్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ఏప్రిల్ 16, 2019న ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంస్థ అధ్యక్షులు శ్రీ చినసత్యం వీర్నపు, కార్యక్రమ సమన్వయకర్త సతీష్ బండారు, మల్లిక్కొండా ఆధ్వర్యంలో సాంస్కృతిక సమన్వయకర్త కళ్యాణి తాడిమేటి పర్యవేక్షణలో ఉగాది ఉత్సవాలు ఆనంద డోలికల్లో ఊయలలూగించాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా విచ్చేసిన రఘు వేముల తనదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఉగాది పర్వదినోత్సవానికి 150కి పైగా తెలుగు వారు హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. 

సంస్థ అధ్యక్షులు శ్రీ చినసత్యం వీర్నపు వికారిసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ.. తమ అధ్యక్ష సందేశంలోకార్యవర్గ సభ్యులందరి సంపూర్ణ సహకారంతో 2019వ సంవత్సరంలో "ప్రగతి పథంలో దశాంశ సూత్రాలు” గమ్యంగా, సాంస్కృతిక అవసరాలతో పాటు మారుతున్న తమ సభ్యుల అవసరాలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను రూపుదిద్దుతున్నామని వివరించారు. కార్యక్రమాల నాణ్యత పెంచడం కోసం ఈ ఉగాదికి ప్రత్యేకంగా స్థానిక కార్యక్రమాలు, విందు భోజనం, అనంతరం సుమంగళి, నరేంద్రల బృందంతో కచేరిని, మిమిక్రి ఆర్టిస్ట్ కళారత్న మల్లంరమేష్ హాస్యభరితమైన ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సభ్యుల అవసరాలకు అనుగుణంగా ఉచిత సినిమా ప్రదర్శన, పన్నులు చెల్లించడానికి అవసరమైన మెళుకవలు, జాగ్రత్తలు, క్రీడారంగంలో వాలిబాల్, టేబుల్ టెన్నిస్, ఆరోగ్యపరంగా సీపీఆర్ ట్రైనింగ్, సాంకేతికపరంగా "మెషీన్ లెర్నింగ్ - ఏ లైటెనింగ్ బూట్ క్యాంప్” వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. సభ్యుల నుంచి మంచి స్పందన రావడం జరిగిందని తెలియజేశారు. మునుముందు పెద్దలకు ఆరోగ్య అవగాహన, మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలను, పిల్లలకు కళాశాలల ఎంపిక, దరఖాస్తులను ఎలా చేయాలి అనే అంశాలను  తీసుకురావడానికి సన్నాహాలు సిద్దం అవుతున్నాయని తెలియజేశారు.
 

ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్ 2019 “ఉగాది పురస్కారాల’’ను ఈ సంవత్సరం సాహిత్యం, సంగీతం, నాట్యం, సమాజసేవ, సాంకేతిక, వైద్య రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు.తెలుగు సాహిత్య రంగంలోకి రణ్ప్రభ, సంగీతం రంగంలో శ్రీనివాస్ప్రభల, నాట్యం రంగంలో శ్రీమతి శ్రీలత సూరి, సమాజసేవ రంగంలో శ్రీకాంత్ పోలవరపు, సాంకేతికరంగంలో డా. సాంబారెడ్డి, వైద్యరంగంలో డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, డా. కోసూరిరాజు గారికి ఈ పురస్కారాలను అందచేశారు. వివిధ కార్యక్రమాలలో తమదైన శైలిలో సేవలను అందిస్తున్న, అవినాష్ వెల్లంపాటి, కిరణ్మయి వేములకు ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు(బెస్ట్ వాలంటీర్) ’పురస్కారంతో సత్కరించి వారి సేవాధృక్పదాన్ని చాటారు. ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ట్రినిటీ హైస్కూల్ సూపరింటెండెంట్ స్టీవ్ చాప్మన్ మాట్లాడుతూ తెలుగు వారి విశిష్టత, సేవా కార్యక్రమాలను కొనియాడారు. తరువాత డా. స్టీవ్ చాప్మన్‌ను ఘనంగా సత్కరించారు. సన్మాన కార్యక్రమంలో భాగంగా గాయకులు సుమంగళి, నరేంద్ర, మిమిక్రి ఆర్టిస్ట్ కళారత్నమల్లంరమేష్, వ్యాఖ్యాత రఘువేములకు జ్ఞాపికలతో టాంటెక్స్ సంస్థ కార్యవర్గబృందం సభ్యులు సత్కరించారు. 

వందన సమర్పణ గావిస్తూ, కార్యక్రమ సమన్వయకర్త సతీష్ బండారు ప్లాటినం, గోల్డ్, సిల్వర్, ప్రెజెంటింగ్, ఈవెంట్ పోషక దాతలకు, ప్రసారమాధ్యమాలకు కృతఙ్ఞతలు తెలియజేశారు. తమ ప్రతిభతో సభాప్రాంగణానికి కొత్త అందాలు తెచ్చిన ‘స్పార్కల్స్”, టిక్కెట్ల అమ్మకంలో కీలకపాత్ర పోషించిన మైడీల్స్ హబ్.కాం  వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సంయుక్త కార్తదర్శి ప్రబంధ్ తోపుడుర్తి, కోశాధికారి శరత్యర్రం, శ్రీకాంత్ జొన్నల, సతిష్ బండారు, యన్.యం.రెడ్డి, పవన్ రాజ్నెల్లుట్ల, ఉపాధ్యక్షులు లక్ష్మిపాలేటి, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు, వివిధ నామినేషన్ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

ఫొటోల కోసం క్లిక్ చేయండి