Ugadi-and-Sriramanavami-celebrations-in-Chigaco-

చికాగో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు

చికాగో తెలుగు అసోసియేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో చికాగోలోని శ్రీ బాలాజీ టెంపుల్ ఆడిటోరియంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు 600 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో వివిధ రకాల కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం, ఉగాది పచ్చడి పోటీలు, తెలుగు భాషకు సేవ చేసిన ప్రముఖులకు సత్కారం వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వేడుకలకు హాజరైన అతిథులను స్వాగతించిన సీటీఏ డైరెక్టర్ సుజన ఆచంట ఈ ఏడాది తాము చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. 2019 సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ-మార్టిన్ లూథర్ కింగ్ స్కాలర్‌పిష్ అవార్డును కూడా సీటీఏ ప్రకటించింది. ప్రముఖ విద్యావేత్త, చికాగో యూనివర్శిటీ అధ్యక్షురాలు మిస్. స్కాట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గాంధీ-లూథర్ కింగ్ పేరిట స్కాలర్‌షిప్ ప్రకటించడంపై ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌ల పేరిట విద్యార్థులలో ప్రేరణ నింపడం మంచి పరిణామమన్నారు. ఇద్దరు నాయకులు వారి దేశాల కోసం ఎంతగానో పోరాడారని గాంధీ-లూథర్ కింగ్ గురించి గుర్తుచేశారు. ఫొటోల కోసం క్లిక్ చేయండి.

ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు:
తెలుగు భాష, హిందూ ధర్మం, సమాజ సేవ ఇలా వివిధ రంగాలలో తమ సత్తాను చాటి, సేవ చేసిన పలువురికి మొదటిసారిగా సీటీఏ ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను అందజేసింది. ఎన్నో దశాబ్దాలుగా హిందూ ధర్మం, సంప్రదాయం గురించి పాటుపడిన శ్రీ శుభద్రాచార్యులు శ్రీనివాసుల వారికి, తెలుగు సాహిత్యంలో తన సత్తాను చాటిన డాక్టర్. శారదా పూర్ణా సొంటి, సంఘసేవ చేసినందుకు గాను శ్రీ ఆజాద్ శుంకవల్లికి ఈ పురస్కారాలతో సత్కరించారు. వీరు ముగ్గురు పలు దశాబ్దాలుగా అమెరికాలో తమ సేవలను కొనసాగిస్తూ ఎందరికో ప్రేరణ కలిగించారని సీటీఏ సభ్యులు కొనియాడారు. సీటీఏ వ్యవస్థాపకులు రవి ఆచంట, ప్రవీణ్ మోటూరు, అధ్యక్షుడు నాగేంద్ర వేగే, బోర్డు సభ్యులు రావు ఆచంట, శేషు ఉప్పలపాటి, చుండు శ్రీనివాస్, అశోక్ పగడాల, శ్రీని యెరమాటి, వెంకట గ్యాజంగి, రాహుల్ విరాటపు, రాణి వేగే, సుజన ఆచంట, అనిత గోలి, వ్యాపారవేత్త రమేష్ తూము, దేవాలయ ట్రస్టీలు ఎమ్. రావు, హరినాథ్ కోనేరు, ఆటా వ్యవస్థాపకులు హనుమాథ్ రెడ్డి, టాటా ప్రకాశం చేతుల మీదుగా అవార్డులను సత్కరించారు. కాగా, సీటీఏ సాంస్కృతిక బృందం సుజనా, రాణి వేగే, అనితా గోలి, అనూష విదపలపాటి, భవాని సరస్వతి, రత్నా చోడ, తనూజ సజ్జా, సుధా కుంచనపల్లి, సుభద్ర బల్లా, సురేష్ బాదం, వాలంటీర్లు భూషన్ భీమిశెట్టి, హరీష్ జన్ను, అదిల్, నవీన్ లగుడు, నవీన్ గరగ, వినయ్ చెన్నుపాటి, బాలా చోడ, నరేన్ సుంకర, మురళి కలగర తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగే సీటీఏ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.