TPAD-Kick-Of-Event-Conducted-in-Dallas

డాలస్‌లో ఘనంగా టీపాడ్ బతుకమ్మ, దసరా సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్‌

డాలస్ తెలంగాణ ప్రజా సమితి(టీపాడ్)  అక్టోబర్ 5, 2019న అంగరంగ వైభవంగా నిర్వహించనున్న బతుకమ్మ దసరా సంబరాల వేడుకకు కూచిపూడి ఇండియన్ కిచెన్ బాంక్వెట్ హాల్, ఇర్వింగ్ , టెక్సాస్‌ హాల్‌‌లో శ్రీకారం చుట్టింది. టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రా రెడ్డి పోలీస్ ఈ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు వచ్చిన అతిథులకు, అమెరికా జాతీయ తెలుగు సంస్థల, ప్రాంతీయ తెలుగు సంస్థల, తెలుగేతర సంస్థల కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ మాధవి లోకిరెడ్డి ‘కిక్ ఆఫ్ ఈవెంట్’ సమన్వయకర్తలుగా వ్యవహరించి ఈవెంట్‌కు శోభను తెచ్చారు. ముందుగా స్వాతి ప్రార్థనా గీతాన్ని ఆలపించగా టీపాడ్ కార్యవర్గసభ్యులు నగర ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. 

సుధాకర్ కలసాని, మాధవి లోకిరెడ్డి ఈ ఏడాది సాంఘిక పరమైన బాధ్యతలలో భాగంగా మార్చ్‌లో జరిపిన రక్తదాన శిబిరం, ఏప్రిల్, మే నెలల్లో జరిపిన వివిధ సదస్సుల గురించిన వివరాలు తెలియజేశారు. అదే విధంగా జూన్‌లో జరిపిన వనభోజనాలు, ఆగస్ట్‌లో జరిపిన లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ గురువు రామాచారి కొమండూరి,  వీరమాచినేని గార్లతో  ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాల గురించి తెలిపారు. టీపాడ్ సంస్థ గత ఆరు సంవత్సరాలుగా కమ్యూనిటీలో జరిగే ప్రతీ కార్యక్రమానికి చేయూతనిస్తూ, సహాయ సహకారాలను అందిస్తూ అండదండగా నిలబడుతూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్న తీరును అందరితో పంచుకున్నారు.
 
టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ పర్సన్ జానకి మందాడి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్ పర్సన్ గంగాధర, ప్రెసిడెంట్ చంద్రారెడ్డి పోలీస్ అక్టోబర్ 5వ తేదీన ఆలెన్ ఈవెంట్ సెంటర్, డాలస్ నగరంలో టీపాడ్ సంస్థ జరిపే బతుకమ్మ దసరా సంబరాల ఫ్లయర్ చిత్రాన్ని కమిటీ సభ్యులతో, జాతీయ, ప్రాంతీయ తెలుగు, తెలుగేతర నగర ప్రముఖులతో కలిసి విడుదల చేశారు. చంద్రారెడ్డి పోలీస్ టీపాడ్ 2019 బతుకమ్మ దసరా సంబరాల కమిటీ చైర్, కోచైర్ పర్సన్లను వేదిక పైకి ఆహ్వానించగా  జానకి మందాడి, పవన్ గంగాధర పన్నెండు వేల మందికి పైగా హాజరయ్యే వారి కోసం ఈవెంట్లో జరిపే సాంస్కృతిక, బతుకమ్మ, దసరా కార్యక్రమాల వివరాలు, బతుకమ్మ, దసరా సంబరాలకు వచ్చే సినిమా, జానపద కళాకారుల, రాజకీయ అతిథుల వివరాలను తెలియజేశారు.
 
టీపాడ్ ఫౌండేషన్ టీం అజయ్ రెడ్డి, రావు కలవల, రఘువీర్ బండారు, మహేందర్ కామిరెడ్డి , బోర్డ్ అఫ్ ట్రస్టీస్ శారద సింగిరెడ్డి, ఇంద్రాణి పంచార్పుల, గోలి బుచ్చిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటి శ్రీనివాస్ గంగాధర, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, రత్న ఉప్పల, శ్రీనివాస్ వేముల, లింగారెడ్డి అల్వా,  అడ్వైసరి కమిటి రామ్ అన్నాడి , అశోక్ కొండల , వేణు భాగ్యనగర్ , విక్రమ్ జంగం, జయ తెలకలపల్లి,  కరణ్ పోరెడ్డి , కొలాబరేషన్ టీం గాయత్రి గిరి, స్వప్న తుమ్మపాల, రేణుక చనుమోలు, శశి కర్రి, శ్రవణ్ నిడిగంటి, బాల గణపవరపు, కిరణ్ తాల్లూరి,  శ్రీనివాస్ తుల, విజయ రెడ్డి, సత్య పెర్కారి, నీరజరెడ్డి పడిగెల ‘కిక్ ఆఫ్ ఈవెంట్’కి హాజరై నిర్వహణ కార్యక్రమానికి చేయూతనిచ్చి విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు.
 
జానకి మందాడి, పవన్ గంగాధర,  చంద్రారెడ్డి పోలీస్, సుధాకర్ కలసాని సంయుక్తంగా విరాళాలు ఇచ్చిన దాతలకు, కూచిపూడి కిచెన్ యాజమాన్యానికి, మీడియా మిత్రులకు, తానా, ఆటా, నాట్స్ , టాటా, ఐ.ఏ.న్.టి, టాంటెక్స్, డాటా, జెట్, మనబడి సంస్థలకు,  కమ్యూనిటీ లీడర్స్ అందరికి కృతజ్ఞాభివందనములను తెలియచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా నలుమూలల ఉన్నటు వంటి భారతీయులందరికి టీపాడ్ అక్టోబర్ 5వ తేదీన ఆలెన్ ఈవెంట్ సెంటర్, డాలస్ నగరములో జరిపే బతుకమ్మ , దసరా సంబరాలకు స్వాగతం పలికారు.