Tin-retires-with-honors-from-8-year-career-with-Coast-Guard

ఎనిమిదేళ్లు దేశానికి సేవ చేసి రిటైర్ అయిన కుక్క

వర్జీనియా: దేశం కోసం నిరంతరాయంగా ఎనిమిదేళ్లపాటు సేవలందించిన సీనియర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ టిన్ రిటైర్ అయ్యారు. టిన్ అంటే ఎవరో మనిషి అనుకునేరు. టిన్ అనేది కుక్క పేరు. టిన్ ఎనిమిదేళ్ల నుంచి కోస్ట్ గార్డ్‌గా పనిచేస్తూ ఎన్నో పేలుడు ఆయుధాలను కనుగొంది. ఈ ఎనిమిదేళ్లలో కౌంటర్ టెర్రరిజమ్ యూనిట్‌లో, మెరిటైమ్ సెక్యూరిటీ రెస్పాన్స్ టీమ్‌లో పేలుళ్ల నిర్ధారణకు పనిచేసింది. 2011 వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల్లో మరణించిన సాంటోస్ వాలెంటిన్ పేరులో నుంచి టిన్ అనే పేరును ఈ కుక్కకు పెట్టారు. రిటైర్ అయిన టిన్‌కు అధికారులు పదవీ విరమణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిన్ సాధించిన ఘనతలను ఓ షీల్డ్‌గా రూపొందించి బహుమతిగా ఇచ్చారు. టిన్ మాత్రం బహుమతిని పక్కనపెట్టి తనను ఎవరు నిమురుతారా, ఎవరు ఏం పెడతారా అనే చూసింది. కాగా, రిటైర్ అయిన టిన్‌ను మిచెల్ అనే అధికారి దత్తత తీసుకున్నారు. టిన్‌కు తిని కూర్చోడం ఇష్టం ఉండదని, రిటైర్ అయిన తర్వాత కూడా టిన్‌ బిజీగా ఉండేలా తినడమో లేదా ఎటైనా తిరగడమో చేస్తూనే ఉంటుందని తెలిపారు.