Thief-sticks-Rs-70-thousand-worth-of-scotch-down-his-pants

మూడుగంటల్లో మూడుసార్లు వైన్‌షాప్‌కు.. సీసీఫుటేజ్ పరిశీలిస్తే..

ఫ్లోరిడా: వెయ్యి డాలర్లు(70 వేల రూపాయలకు పైగా) విలువచేసే స్కాచ్ మందును దొంగిలించిన వ్యక్తి కోసం ఫ్లోరిడా పోలీసులు గాలిస్తున్నారు. మియామి నగరానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న టోటల్ వైన్ అనే వైన్ షాపులో అక్టోబర్ 5వ తేదీన ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఒకే రోజు మూడు సార్లు వైన్ షాపుకు వెళ్లాడు. వెళ్లిన ప్రతిసారీ షాపులో ఉన్న స్కాచ్ బాటిళ్లను తన ప్యాంటులో దాచుకుని బయటకు వచ్చేశాడు. ఇలా మూడు సార్లు మొత్తంగా వెయ్యి డాలర్లు విలువచేసే మద్యాన్ని దొంగిలించాడు. మరుసటి రోజు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన వైన్ షాప్ యజమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటను పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం తాము గాలిస్తున్నామని, సీసీ ఫుటేజ్ ద్వారా తీసిన నిందితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.