terrified-Time-

భారీ మొసలి సంచరిస్తుందని తెలియడంతో..

ఫ్లోరిడా: ఓ భారీ మొసలి మియామిలో సంచరిస్తోంది. అది సంచరిస్తున్న విషయం తెలిసిన నాటి నుంచి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. దాదాపు 8 అడుగుల పొడవున్న ఆ మొసలి రాత్రిపూట ఇళ్లల్లో ఉండే స్విమ్మింగ్‌ఫూల్స్‌లోకి ప్రవేశిస్తోందని స్థానికులు తెలిపారు. గమనించకుండా ఎవ్వరైనా స్మిమ్మింగ్‌ఫూల్స్‌లోకి దిగితే పెను ప్రమాదం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులోనే ఆ మొసలిని మియామిలో చూశామని అధికారులు తెలిపారు. ఓ జంతు ప్రదర్శనశాలలో నుంచి తప్పించుకుని జనవాసాల్లోకి వచ్చిందని వారు అన్నారు. రెండు నెలలుగా మొసలిని పట్టుకునేందుకు అధికారులు చేసిన కృషి చివరికి ఫలించింది. వైల్డ్ లైఫ్ అధికారి డేవిడ్ మాట్లాడుతూ మొసళ్ల వల్ల ఫ్లోరిడాలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా స్మిమ్మింగ్‌ఫూల్స్, నదులు, సరస్సుల్లో ఉండే మొసళ్లను గుర్తించకపోవడం వల్ల ఎక్కువగా మనుషులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. భూమ్మీద ఉన్న సమయంతో పోలిస్తే నీళ్లల్లోనే మొసళ్లకు ఎక్కువ శక్తి కలిగి ఉంటాయని డేవిడ్ గుర్తు చేస్తున్నారు.