Telugu-gaining-more-popularity-in-USA

అమెరికాలో ‘తెలుగు’... వావ్

న్యూయార్క్ : అమెరికాలో ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాష ఏదో తెలుసా ? అది ‘తెలుగు’. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాషల్లో తెలుగు భాష రెండవ స్థానంలో ఉంది. అమెరికాకే చెందిన ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సరే్వకు సంబంధించిన నివేదిక వివరాలివి. కాగా బీబీసీ నిర్వహించిన సర్వే ప్రకారం... 2010-2017 మధ్య కాలంలో అమెరికాలో నివసిస్తున్న వారిలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య 86 శాతం పెరిగింది. అంటే... 2017 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడేవారు నాలుగు కోట్ల మంది ఉన్నారని ఆ సర్వే వెల్లడించింది.

ఇది... 2010 లో అమెరికాలోని తెలుగు మాట్లాడే వారి సంఖ్యకు రెట్టింపు. 1990 మధ్య కాలంలో అమెరికాలో ఇన్షర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానం అనూహ్యంగా పెరిగిపోవడంతో... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిపుణుల అవసరం అమెరికాకు బాగా ఏర్పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 800 వరకు ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఈ క్రమంలోనే... అమెరికాకు వెళ్ళే తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతూ వచ్చింది. కాగా అమెరికాలో తెలుగు తర్వాత అత్యధికంగా మాట్లడే భాషల్లో తమిళం, గుజరాతీ, బెంగాలీ నిలుస్తున్నాయి.