TATVA-s-Rangasthalam-event-is-a-huge-success

‘తత్వ’ ఆధ్వర్యంలో అమెరికాలో వైభవంగా ‘రంగస్థలం’..

కాలిఫోర్నియా: అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవ్యాలీ(తత్వ) ఆధ్వర్యంలో ‘రంగస్థలం’ సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా జరిగింది. కాలిఫోర్నియా నగరంలోని సిమీవ్యాలీ పట్టణంలో ఆగస్టు 3న జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మ సంవత్సరం, ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈ కార్యక్రమంలో వైభవంగా జరుపుకున్నారు. దీనిలో సుమారు 100మందిపైగా పిల్లలు పాల్గొని తమ ఆటపాటలతో వీక్షకులను అలరించారు. ఇవేగాక పలు హాస్యనాటికలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటలకు నృత్యరూపమిస్తూ ‘విశ్వనాథామృతం’ పేరిట ఆహుతులను మైమరిపించారు. కాలిఫోర్నియా ప్రాంతంలో బాలబాలికలకు భారతీయ కళలు, తెలుగు భాష నేర్పుతున్న గురువులను ఈ సందర్భంగా ‘తత్వ’ నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.