TANA-2019-DC-Convention-Logo-Launch

తానా 22వ మహాసభల లోగో ఆవిష్కరణ

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో  జులై 4 నుంచి ఆరు వరకు వాషింగ్టన్ డీసీలో జరుగనున్నతానా 22వ మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు సతీష్ వేమన, మహాసభల కన్వీనర్ డా. రావు మూల్పూరి, చైర్మన్ డా. నరేన్ కొడాలి, ఫౌండేషన్ ట్రెజరర్ రమాకాంత్ కోయ ఈ లోగోను ఆవిష్కరించారు. "ఐక్యత - నైపుణ్యం- పురోగమనం" నేపథ్యం ఉన్న ఈ లోగోలో అమెరికా, కెనడా, ఇండియా జండాలు కలిసి ముడివేసుకుని అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ హిల్ బ్యాక్‌గ్రౌండులో కాకతీయ తోరణం, అమరావతి బుద్ధుడి విగ్రహం కలిపి ఐకమత్యంతో తెలుగు జాతి ఉత్తర అమెరికాలో పురోగమనం దిశగా ప్రయాణించాలనే ముఖ్యఉద్దేశ్యంతో డిజైన్ చేయబడింది. మహాసభలకు ముందు వివిధ నగరాల్లో సాంస్కృతిక పోటీలు, విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు కవులు, కళాకారులు, మేధావులు ఈ మహాసభలకు హాజరు అవుతారని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు.