TAGS-Conducting-Essay-Competition

టాగ్స్ ఆధ్యర్యంలో శ్రీ యూఏఎన్ మూర్తి మెమోరియల్ రెండో రచనల పోటీ

 • విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస  తెలుగువారి రచనలకు టాగ్స్ ఆహ్వానం
 • రచనలు చేరాల్సిన ఆఖరి తేదీ: డిసెంబర్ 1, 2019
శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) ఆధ్వర్యంలో శ్రీ యూఏఎన్ మూర్తి మెమోరియల్ రెండో రచనల పోటీలు 2020 సంక్రాంతి సందర్భంగా జరగనున్నాయి. భారతదేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరూ (ప్రవాస తెలుగు వారు) ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని సంస్థ సభ్యులు కోరుతున్నారు. మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం.. తెలుగు భాష,  తెలుగు సంస్కృతి వ్యాప్తికి 2003 సంవత్సరం నుంచి శాక్రమెంటో పరిసర ప్రాంతాలలో విశేష కృషి చేస్తోంది. అమెరికా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సింగపూర్, మలేసియా తదితర దేశాలలో నివసించే తెలుగు రచయితలకు ఆహ్వానం పలుకుతోంది. కాగా, స్నేహపూర్వకమైన ఈ రచనల పోటీలో రెండు  విభాగాలు ఉన్నాయి.
1. ప్రధాన విభాగం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితల నుంచి నూతన, అముద్రిత తెలుగు రచనలను ఈ పోటీకి ఆహ్వానిస్తున్నారు.
ఉత్తమ కథానిక: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28
ఉత్తమ కవిత:    (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28
వీటితో పాటుగా ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి. 
 
2. అనువాద కథ రచనా విభాగం (18 ఏండ్ల లోపు యువ రచయితలకు)
ప్రవాస యువ రచయితలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక విభాగంలో పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 18 ఏండ్లలోపు వయసు ఉన్న ఔత్సాహిక ప్రవాస  యువ తెలుగు రచయితలను ఈ తెలుగు రచనా విభాగం పోటీలో పాల్గొనాలని సంస్థ సభ్యులు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. పోటీలో పాల్గొనే వారి వయస్సు డిసెంబర్ 1, 2019 నాటికి 18 ఏండ్లలోపు ఉండాలి.
ఉత్తమ అనువాద కధ – 13 ఏండ్ల లోపు వయస్సు ఉన్న యువ రచయితలకు: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ:  $116, $58, $28
ఉత్తమ అనువాద కధ – 13 ఏండ్ల నుంచి 18 ఏండ్ల లోపు వయస్సు ఉన్న యువ రచయితలకు: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ:  $116, $58, $28
వీటితో పాటు ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి.
 
అన్ని పోటీలకు ముఖ్య గమనికలు:
 • ఒక రచయిత ఒక్కో పోటీలో ఒక ఎంట్రీ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. కథలు పది పేజీల లోపు, కవితలు ఐదు పేజీల లోపుగా ఉండాలి. పేజీ గరిష్ఠ కొలత 8.5 అంగుళాలు X 11 అంగుళాలు ఉండాలి. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
 • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్, స్వంత పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న లేదా ప్రచురించబడిన రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో పాటు విధిగా జత పరచాలి. 
 • ప్రధాన విభాగం పోటీలో పాల్గొనే రచయితలకు 18 ఏండ్లు నిండి ఉండాలి. ప్రధాన విభాగంలో స్వీయ రచనలు పంపాలి. ప్రధాన విభాగంలో అనువాద కధలు, అనువాద కవితలు అనుమతింపబడవు.
 • అనువాద కథ, కవితల రచనా విభాగం (18 ఏండ్ల లోపు రచయితలకు) పోటీలో పాల్గొనే వారు డిసెంబర్ 1, 2019 నాటికి తమ వయస్సు 18 ఏండ్ల లోపు అని తమ హామీ పత్రంలో పేర్కొనాలి. మూల కథ ఏ భాషలోనైనా ఉండవచ్చు. కానీ అనువదింపబడిన కథ మాత్రం పోటీదారు స్వంతంగా తెలుగులోకి అనువదించిన రచన అయి ఉండాలి. 18 ఏండ్ల లోపు ఉన్న యువ రచయితల తల్లిదండ్రులు వారి తరపున హామీపత్రం పూరించవచ్చును.
 • హామీపత్రం/ధ్రువీకరణ పత్రం ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌‌‌లోడ్ చేసుకోగలరు: https://tinyurl.com/tagsform
 • డౌన్‌లోడ్ చేసుకున్న పిదప సదరు పత్రం పూరించి, రచన(ల)తో పాటుగా మాకు ఈ-మెయిల్ చెయ్యగలరు.
 • రచనల్లో ఎక్కడా మీ పేరు కానీ, మీ కలం పేరు కాని వ్రాయకూడదు. మీ రచనలు మాకు పంపినప్పుడు, మీ హామీపత్రంలో ఆ వివరాలు రాస్తే సరిపోతుంది.
 • మీ రచనలను తెలుగులో టైపు చేసి పంపితే బాగుంటుంది. యూనికోడ్ (Unicode)లో ఉన్న మీ రచనలు పంపితే మాకు శ్రమ తగ్గించిన వారు అవుతారు అని గమనించగలరు. చేతిరాత ప్రతులను పంపేవారు సదరు రచయిత చేతిరాత స్పష్టంగా, చదువ శక్యంగా ఉండాలని మనవి. అస్పష్ట, సందిగ్ధమైన లేదా చదవడానికి వీలుకాని రచనలు పోటీకి పరిశీలింపబడవు.
 • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net), సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె”  http://sirimalle.com ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలును బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
 • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో ప్రచురిస్తారు.
 • విజేతల వివరాలు రాబోయే సంక్రాంతి 2020 పండుగకు ముందు ప్రకటిస్తారు. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితలు ఇతర పోటీలకు, మరెక్కడా ప్రచురించకూడదు.
 • కాలిఫోర్నియా రాష్ట్రంలో నెలకొని ఉన్న శాక్రమెంటో నగరంలో జనవరి 11, 2020న జరగబోయే టాగ్స్ 16వ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాల సందర్భంగా సభా ముఖంగా వేదికపై  విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. రాలేని వారికి పోస్టులో బహుమతులు పంపడం జరుగుతుంది. విదేశాలలో ఉంటున్న తెలుగు రచయితలకు ఇది ప్రత్యేక అవకాశం.
 • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలు, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
 • మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 1, 2019
 • మీ రచనలు మా ఈ-మెయిలు [email protected] కు PDF, JPEG లేదా యూనికోడ్(Unicode)లో పంపండి. యూనికోడ్‌లో పంపితే మరీ మంచిది.
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం
 • నాగ్ దొండపాటి (అధ్యక్షులు)
 • దుర్గ చింతల (కార్యదర్శి)
 • మోహన్ కాట్రగడ్డ (కోశాధికారి)
 • రాఘవ చివుకుల (సమాచార అధికారి)
 • సత్యవీర్ సురభి (సలహామండలి  సభ్యుడు)
 • అనిల్ మండవ (చైర్మన్)
 • మల్లిక్ సజ్జనగాండ్ల (వైస్ చైర్మన్)
 • వెంకట్ నాగం (ట్రస్టీ)
 • మనోహర్ మందడి(ట్రస్టీ)
 • వెంకటేష్ రాచపూడి (కార్యకర్త)