TAGS-Announced-UAN-Murthy-Memorial-2nd-Literacy-Contest-results

రచనల పోటీ విజేతలను ప్రకటించిన టాగ్స్!

కాలిఫోర్నియా: సంక్రాంతి 2020 సందర్భంగా అమెరికాలోని కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం(టాగ్స్) ఆధ్వర్యంలో ‘‘శ్రీ యూఏఎన్ మూర్తి స్మారక 2వ రచనల పోటీ” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విజేతల జాబితాను టాగ్స్ ప్రకటించింది. విదేశాలలో ఉన్న తెలుగు వారికే పరిమితమైన ఈ పోటీలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ పాల్గొనడం హర్షణీయం. 

టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవలో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన ప్రవాస రచయితలందరికీ టాగ్స్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి పంపిన అన్ని రచనలకు సర్వహక్కులు రచయితలవేనని టాగ్స్ తెలిపింది. బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net), సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె” http://sirimalle.comతో పాటు ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలును, వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయని టాగ్స్ స్పష్టం చేసింది. బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలోనూ ప్రచురించబడతాయని పేర్కొంది.

ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపికయ్యాయి:

ప్రధాన విభాగం: ఉత్తమ కథానిక విభాగం విజేతలు
 • ప్రథమ బహుమతి: ప్రతి బింబం - ఉమాదేవి అద్దేపల్లి (శాన్ హోసే , కాలిఫోర్నియా, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
 • ద్వితీయ బహుమతి: దత్త పుత్రుడు - శ్రీశేష కల్యాణి గుండమరాజు (రాక్లిన్, కాలిఫోర్నియా, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
 • తృతీయ బహుమతి: ప్రదక్షిణం - తాటిపర్తి రజనీకాంత్ రెడ్డి (దక్షిణాఫ్రికా) ($28, ప్రశంసా పత్రం)
ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:
 • మూడు తరాల తోట - మల్లికేశ్వర రావు కొంచాడ (ఆస్ట్రేలియా)
 • మేలిమి వజ్రం - వాత్సల్య రావు (సింగపూర్)
 • నీలదంతం - ఆర్. శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా)
 • పితృప్రేమ - రాధిక నోరి (ఫ్లోరిడా, అమెరికా)
 • గోపాలరావు లాంటి స్నేహితుడు మీకు దొరుకుతాడా? - రవి కుమార్ పిశుపాటి (లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, అమెరికా)
ఉత్తమ కవిత విభాగం విజేతలు:
 • ప్రథమ బహుమతి: మనిషీ ఓ మనిషీ - గౌతమ్ లింగ (దక్షిణాఫ్రికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
 • ద్వితీయ బహుమతి: జటాయువు (పద్య ఖండము) - శేషం శ్రీవాత్సవ (లాస్ ఏంజల్స్, కాలిఫొర్నీయా, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
 • తృతీయ బహుమతి: తెలుగేలరా - ఆర్. శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా) : ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:
 • అదృశ్యం - విశాలాక్షి దామరాజు (కెనడా)
 • పెన్సిల్ "గీత" - రవికాంత్ పొన్నాపల్లి (టెక్సాస్, అమెరికా)
 • కరభూషణం - మానస చమర్తి (మసాచుసెట్స్, అమెరికా)
 • హాలాహలము - శ్రీధర రెడ్డి బిల్లా (క్యూపర్టినో, కాలిఫొర్నీయా, అమెరికా)
 • దేశానికి వెన్నెముక ఈ రైతేనా - మల్లిఖార్జున రావు కొమర్నేని (ఓక్లహోమా, అమెరికా)

“అనువాద కథ రచన పోటీ - 13 ఏండ్లలోపు యువ రచయితల విభాగం"

ప్రోత్సాహక బహుమతి గెలుచుకున్న చిన్నారి:
 • పరోపకారార్ధం - సంహిత పొన్నపల్లి (టెక్సాస్, అమెరికా)
కాగా.. విజేతలందరికీ టాగ్స్ అభినందనలు తెలిపింది. టాగ్స్ ఆధ్వర్యంలో “శ్రీ యూఏఎన్ మూర్తి స్మారక 2వ రచనల పోటీ” నిర్వహణకు సహాయ సహకారలు అందజేసిన గ్రీట్ వే సంస్థకు టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుందని తెలిపింది. భారత్‌తో సహా విదేశాలలో నివసిస్తున్న రచయితలు ఎవరైనా వారి కథ, కథానిక, కవిత, వ్యాసాలు, పుస్తక పరిచయం వంటి రచనలు తమ ఈ-మెయిల్ అడ్రస్ [email protected]కు పంపవచ్చని అన్నారు.