TACO-grandly-celebrated-Diwali-in-Ohio

సెంట్రల్ ఒహాయొ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు

ఒహాయో: అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన సెంట్రల్ ఒహాయొ తెలుగు సంఘం(టాకో) అక్టోబర్ 26న వెస్టర్విల్ నార్త్ హైస్కూల్లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వర్షాన్నీ, చిరుచలిని అధిగమించి 1200 మందికి పైగా కొలంబస్ తెలుగు ప్రజలు ఈ వేడుకకు హాజరయ్యారు. టాకో అధ్యక్షులు ఫణి భూషణ్ పొట్లూరి గారు జ్యోతి ప్రజ్వలనతో మొదలైన వేడుకలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాయి. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసే టాకో సంఘం కూచిపూడి, భరతనాట్యం వంటి కళా ప్రదర్శనలు, ‘బాబు బంగారం’ వంటి సాంఘిక హాస్యనాటకంతో పాటు అనేక సంగీత నాట్యప్రదర్శనలకు వేదికయింది. 50కి పైచిలుకు కార్యక్రమాలు, 300కి పైగా పిన్నలు పెద్దలు పాల్గొన్నారు. ప్రముఖ సినీనటి, గాయని స్నిగ్ద, పాడుతాతీయగా విజేత ప్రవీణ్, అమెరికా ఆడపడుచు, గాయని శృతి ముఖ్యఅతిథులుగా విచ్చేసి వారి గానంతో, నటనతో శ్రోతలను మైమరపించారు. వీరితోపాటు నటి, వ్యాఖ్యాత మధు నెక్కంటి తన మిమిక్రీతో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. మొత్తానికి టాకో వారు అనేక రకాల వంటకాలతో కడుపుని, ఉత్సాహభరితమైన కార్యక్రమాలతో మనస్సు నింపారు. 

ఈ వేడుకల్లో భాగంగా టాకో అధ్యక్షులు ఫణి గారు ఏఐఏ సంస్థ నుంచి ఒహాయో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సంజయ్ సాదానా గారిని ఘనంగా సత్కరించారు. అదే విధంగా టాకోకి ఎప్పుడూ ధారాళంగా విరాళాలందించిన దాతలను కూడా గౌరవంగా ప్రశంసించారు. 2019 టాకో అధ్యక్షులు ఫణి పొట్లూరి గారు, 2020 టాకో కమిటీ అయిన జగన్నాథ్ చలసాని, కాళీ ప్రసాద్ మావులేటి, దశరథరామ్ గద్దె, ఉష శాఖమూరు, రాజ్ వంటిపల్లి, సంపత్ నాలం, విజయ్ కాకర్ల, అనిల్ బ్యాడిగెర, వేణు అబ్బూరి, రామ్ సానేపల్లి, వినోద్ యడ్లపల్లి, సత్య మర్రే, ప్రదీప్ గుంటక, శ్రీ దిత్య అట్లూరి, ప్రవీణ్ కుమార్ అంకం, రాజేష్ చెరుకూరి, భాను పొట్లూరి, శ్రీ వర్షిణి ముద్దులూరు, తేజశ్విని కంచరపల్లి, ప్రదీప్ చందనం, నీలిమ యలమంచిలి, జయ మేడిది, విక్రమ్ రాచర్ల, కీర్తి కౌశిక్ తరణి, అన్వేష్ పెండ్యాల, ఊహ కాట్రగడ్డ, రమ ప్రత్తిపాటి, చిరంజీవి సమ్మెటలను సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించి శ్రోతలకు పరిచయం చేశారు. అలాగే 2021 సంవత్సరానికి టాకో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శివ దావా గారిని కూడా ఆహ్వానించారు. 2020 సంవత్సరానికి గాను శుభాకాంక్షలు తెలిపారు.

ఈ దీపావళి వేడుక అద్భుతంగా జరగడానికి సహకరించిన స్వచ్చంద సేవకులను టాకో బృందమైన ఫణి భూషణ్ పొట్లూరి, జగన్నాథ్ చలసాని, శ్రీనివాస్ పరుచూరి, స్వామి కావలి, హర్ష కామినేని, హారిక కొమ్మూరి, సుధీర కనగాల, వీణా కామిశెట్టి, సరితా నందిమల్ల, శ్వేత, రచన బుక్క, సిద్దార్థ రేవూరు, ప్రదీప్ కుమార్, సంధ్య కనక, విజయ్ కాకర్ల, వేణు అబ్బూరి, రామ్ గద్దె, రాజ్ వంటిపల్లి, ప్రతాప్ కంతేటి, శివ దావా, ప్రదీప్ గుంటక, శ్రీవర్షిణి ముద్దులూరు, సుభాషిణి సదనాల, శ్రీలత రేవూరు, కోటేశ్వర బోడిపూడి, ప్రసాద్ కండ్రు, రమేష్ కొల్లి, శ్రీకాంత్ మునగాల కృతజ్ఞతలు తెలుపుతూ ఇరు దేశాల జాతీయ గీతాలతో వేడుకను ముగించారు.