TACO-Conducts-Rangoli-Celebrations

టాకో ఆధ్వర్యంలో ఘనంగా ‘రంగోళి’ వేడుకలు

డబ్లిన్, ఒహాయో: సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం(టాకో) ఆధ్వర్యంలో జనవరి 11న రంగరంగ వైభవంగా "రంగోళి" వేడుకలు జరిగాయి. టాకో 2020 కమిటీ వారి ఆధ్వర్యంలో డబ్లిన్‌లోని విశాల ప్రాంగణమైన సెయింట్ జాన్ లుతెర్న్ చర్చిలో ఈ వేడుకలను నిర్వహించారు. "రంగోళి" వేడుక 2020 టాకో అధ్యక్షులు జగన్నాథ్ చలసాని గారి ఆధ్వర్యంలో నీలిమ యలమంచిలి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు 2020 కమిటీ సభ్యులు కాళీ ప్రసాద్ మావులేటి, సుధీర్ కనగాల, ఉష శాఖమూరు, రాజ్ వంటిపల్లి, సంపత్ నాలం, విజయ్ కాకర్ల, అనిల్ బ్యాడిగెర, వేణు అబ్బూరి, రామ్ సానేపల్లి, వినోద్ యడ్లపల్లి, సత్య మర్రే, ప్రదీప్ గుంటక, శ్రీదిత్య అట్లూరి, ప్రవీణ్ కుమార్ అంకం, రాజేష్ చెరుకూరి, భాను పొట్లూరి, శ్రీవర్షిణి ముద్దులూరు, తేజశ్వని కంచరపల్లి, ప్రదీప్ చందనం, జయ మేడేది, విక్రమ్ రాచర్ల, కీర్తి కౌశిక్ తరణి, అన్వేష్ పెండ్యాల, ఊహ కాట్రగడ్డ, రమ ప్రత్తిపాటి, చిరంజీవి సమ్మెట సహాయకులుగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో రంగవల్లికలు(చుక్కల ముగ్గులు, సృజనాత్మకత  ముగ్గులు), చిత్రలేఖనం, గాలిపటాలు, కోలాటం పోటీలు నిర్వహించారు. ప్రత్యేకంగా ముగ్గుల పోటీలో పిన్నలు, పెద్దలు, వృద్దులు కూడా హుషారుగా పాల్గొని చక్కటి రంగవల్లికలు వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దారు. పోటీలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. చిత్రలేఖనం పోటీలో పిల్లలు, పెద్దలు పాల్గొని ఎంతో చక్కని రంగులతో, అంశాలతో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. అలాగే గాలిపటం పోటీలకు కూడా పిల్లలు ఎంతో వినూత్నమైన గాలిపటాలను తయారు చేసి ప్రదర్శించారు. ఉత్సాహంగా సాగిన మహిళల కోలాటం పోటీలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

శ్రావణి గండేపల్లి గారి హరి కథ కాలక్షేపం, తొక్కుడు బిళ్ళ ఆట ప్రేక్షకులను అలరింపజేశాయి. "ఏకం" స్వచ్చంధ సంస్థ వారు అల్పాహారాలతో అందరి ఆకలిని తీర్చారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన  వారందరికీ టాకో వారు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టాకో ట్రస్టీలు రేవూరు, జ్యోతి దండు, ఫణి భూషణ్ పొట్లూరి, కోటేశ్వరరావు బోడేపూడి, సుబ్బారెడ్డి కొవ్వూరు విజేతలకు అభినందనలు తెలియజేశారు.