Slowly-Creeping-Across

చిన్న గుంత అంతటా విస్తరిస్తోంది..

కాలిఫోర్నియా: రోడ్డు, రైలు మార్గాలు వెళ్తున్న పక్కనే పెద్ద గొయ్యి ఏర్పడింది. ముందు చిన్న గుంతగా మొదలై తరువాత పెద్ద గొయ్యిలా మారిందని స్థానికులు తెలిపారు. గొయ్యి ఏర్పడిన ప్రాంతంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇలాగే పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడుతున్నాయని వారు చెప్పారు. దాంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు కుంగిపోయాయన్నారు. విపత్తును గ్రహించిన వెంటనే అధికారులకు సమాచారం అందించామన్నారు. ఆ ప్రాంతంలో అధికారులు పరిశోధనలు చేపట్టారు. మొదట ఏర్పడిన గుంత రోజుకి 18మీటర్ల చొప్పున విస్తరిస్తోందని అధికారులు చెబుతున్నారు. దాని లోతు ఇప్పటికే 240 ఫీట్లుగా ఉందన్నారు. గొయ్యి విస్తరిస్తున్న కారణంగానే ఆ ప్రాంతం చుట్టుపక్కల కూడా గుంతలు, గొయ్యిలు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. భూమి పొరల్లో జరుగుతున్న మార్పుల కారణంగానే ఇలా జరుగుతుందని అధికారులు తెలిపారు.