Siliconandhra-manabadi-Telugu-Matlata-finals

అమెరికాలో అంగరంగ వైభవంగా.. సిలికానాంధ్ర ‘తెలుగు మాట్లాట’..

డెట్రాయిట్: సిలికానాంధ్ర మనబడి 7వ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలు ఘనంగా జరిగాయి. ‘పలుకే బంగారం-పదమే సింగారం’ నినాదంతో ఈ పోటీలను అమెరికాలోని డెట్రాయిట్‌లో నిర్వహించారు. 800కు పైగా ప్రాంతీయ పోటీలు నిర్వహించగా, వాటిలో నెగ్గిన 52మంది విజేతలు ఈ ఫైనల్స్‌లో పోటీపడ్డారు. ఈ పోటీల్లో తెలుగు సాహిత్యం, కళలు, జాతీయాలు, సామెతలు, వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు తదితర అంశాలపై ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా మనబడి ఉపాధ్యక్షులు తోటపల్లి ధనుంజయ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘12 ఏళ్లలో మనబడి ద్వారా సుమారు 52వేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకున్నారు. ఈ ఏడాది తరగతులు సెప్టెంబరు 7 నుంచి మొదలవుతాయి’ అని వెల్లడించారు. ఈ తరగతులకు హాజరవ్వాలనుకునే వారు manabadi.siliconandhra.org వెబ్‌సైట్‌లో లేదా 1-844-626-2234 నంబరును సంప్రదించిగానీ పేరు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే ఎవరైనా ‘తెలుగు మాట్లాట’ పోటీలు నిర్వహించదలచుకుంటే maatlata@manabadi.siliconandhra.orgకు మెయిల్ లేదా +1-248-470-7163 నంబరుకు తమ వివరాలు వాట్సాప్ చేయాలని సూచించారు.

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.