principal-stolen-money

ఓ ప్రిన్సిపల్ చేసిన పని ఇది

ఫ్లోరిడా: మానసిక దివ్యాంగుడైన విద్యార్థి వద్ద నుంచి వెయ్యి డాలర్లను దొంగిలించిన ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోనార్టన్ ఎలిమెంటరీ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఎడ్వర్డ్ జాన్(50) అనే వ్యక్తి తన స్టూడెంట్ వద్ద ఉన్న రెండు వేల డాలర్లలో నుంచి వెయ్యి డాలర్లను దొంగిలించాడని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ కావడంతో విషయం వెలుగు చూసిందని వారన్నారు. ఆ విద్యార్థి తన తల్లి దాచుకున్న డబ్బులను ఆమెకు తెలియకుండా స్కూల్‌కి తెచ్చాడని పోలీసులు తెలిపారు. విద్యార్థి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉండటాన్ని గమనించిన క్లాస్ టీచర్ ఆ సొమ్మును లెక్కపెట్టి ప్రిన్సిపల్ టేబుల్‌పై ఉంచిందన్నారు. అదే సమయంలో ప్రిన్సిపల్ విద్యార్థి డబ్బులను దొంగిలించాడని వారు తెలిపారు.