police-send-warning-to-parents

తల్లిదండ్రులకు పోలీసుల హెచ్చరిక..

మియామి: తల్లిదండ్రులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఓ సంఘటన తమ మనసులను తీవ్రంగా కలిచివేసిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. మియామిలో ఓ ఆరేళ్ల బాలుడు తుపాకీతో ఆడుకుంటూ తలపై కాల్చుకోవడంతో అక్కడిక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యమే బాలుడి ప్రాణాలు తీసిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో తుపాకీ వంటి మరణాయుధాలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. లోడ్ చేసిన తుపాకులను ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పిల్లల చేతికి దొరికేలా అందుబాటులో ఉంచొద్దని తల్లిదండ్రులను వారు హెచ్చరిస్తున్నారు.