Police-Deputy-Assaulting-Woman-in-Patrolling-Car

పెట్రోలింగ్ కారులో మహిళ పట్ల పోలీస్ అధికారి అసభ్య ప్రవర్తన

రోసామండ్, కాలిఫోర్నియా: కెర్న్ కౌంటీ పోలీస్ అధికారి ఒకరు పెట్రోలింగ్ కారులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అరెస్ట్ అయ్యారు. కెర్నె కౌంటీ పోలీసుల కథనం ప్రకారం... మైఖేల్ క్లార్క్ అనే పోలీస్ అధికారి ఆగస్టు నెలలో 21 ఏళ్ల మహిళను ఇంటి వద్ద దిగబెడతానని తన పెట్రోలింగ్ కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం కొంత దూరం వెళ్లాక ఆమెను తాకరానిచోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. దాంతో ఆమె తనను కారు నుంచి దించేయాలని కోరింది. కానీ క్లార్క్ మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా తన చర్యను ఇంకా ఎక్కువ చేశాడు. ఇలా 20 నిమిషాల పాటు ఆమె ఇల్లు వచ్చే వరకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు క్లార్క్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అతడిపై అపహరణ, లైంగిక వేధింపులు, అధికార దుర్వినియోగం కింద కేసు నమోదు చేశారు. గురువారం క్లార్క్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.