Only-In-Nine-minutes-

9 నిమిషాల్లో అరుదైన సంఘటన..

టెక్సాస్: కేవలం 9 నిమిషాల సమయంలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన తెల్మ చియాక అనే మహిళ. ఇది చాలా అరుదైన ఘటన అని, వందల కోట్ల మందిలో ఎవరికో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని డెలివరీ చేసిన డాక్టర్లు చెప్పారు. పిల్లల్లో నలుగురు మగపిల్లలు కాగా.. ఇద్దరు ఆడ పిల్లలు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. పిల్లలు 790 గ్రాముల నుంచి 1.3 కిలోగ్రాముల బరువు ఉన్నారని వారు పేర్కొన్నారు.