Nutley-3-Year-Old-Dangles-From-Window-Saved-By-Police

గాఢ నిద్రలో తండ్రి.. కిటికీకి వేలాడుతున్న మూడేళ్ల బాలుడు.. చివరకు..

న్యూజెర్సీ: పిల్లలున్న ఇళ్లలో ఓపెన్ కిటికీలు లేకపోతేనే మంచిది. ఎందుకంటే రోజంతా ఆడుకుంటూనే ఉండే పిల్లలు ఆ ఓపెన్ కిటికీ దగ్గరకు వెళ్లకుండా ఉండరు. అమెరికాలో ఇలా ఓపెన్ కిటికీల కారణంగా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా న్యూజెర్సీలో ఓపెన్ కిటికీ కారణంగా మూడేళ్ల బాలుడు ప్రాణాలు పోయేవి. ఇరుగు పొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడి ప్రాణాలను కాపాడగలిగారు. న్యూజెర్సీ నట్లీలోని వాషింగ్టన్ ఎవెన్యూలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

అసలు ఘటన ఎలా జరిగిందంటే.. పిల్లోడి తండ్రి గాఢనిద్రలో ఉండగా.. ఆడుకుంటూ ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు రెండో అంతస్థులో నివసిస్తున్న ఇంట్లోని ఓపెన్ కిటికీ వద్దకు వచ్చాడు. కిటికీ వద్ద ఓ హ్యాంగర్‌కు వేలాడుతూ ఇరుగు పొరుగు వారికి కనిపించాడు. వారు వెంటనే బాలుడిని రక్షించడానికి ప్రయత్నించారు. పోలీసులకు కూడా సమాచారమిచ్చారు. పోలీసులు నిమిషాల్లోనే అక్కడకు చేరుకోవడంతో రెండు అంతస్థులు ఎక్కి అధికారులు ఆ బాలుడి ప్రాణాలను కాపాడారు. తండ్రి నిద్రపోతున్న సమయంలో ఇలా జరగడంతో ఎటువంటి కేసును నమోదు చేయలేదు. ఓపెన్ కిటికీ ఉన్న వారు జాగ్రత్త వహించాలని సూచించి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలాంటి సంఘటనలు అతి కొద్ది నెలల్లోనే చాలా జరిగాయని.. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.