NRIs-Oppose-3-Capital-Cities-Model

సేవ్ అమరావతి.. అమెరికాలో ఎన్నారైల నిరసన

అమరావతి: కృష్ణానది ఒడ్డున మొదలైన అమరావతి నినాదం కేవలం ఏపీలోనే కాకుండా ఖండాంతరాల్లోనూ మారుమోగుతోంది. ఎన్నారైలు కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా నినదిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బే ఏరియాలో ఒక కార్యక్రమం ఏర్పాటుచేయగా.. మునుపెన్నడూ ఏ కార్యక్రమానికి రానంత మద్దతు ఈ కార్యక్రమానికి దక్కింది. అమరావతి నిర్మాణాన్ని ఆపితే ఏపీ ప్రజలు కోల్పోయేది రాజధానిని మాత్రమే కాదని.. భవిష్యత్తును కోల్పోతారంటూ ప్రముఖ ఎన్నారై కోమటి జయరాం ఉద్వేగానికి లోనయ్యారు. 

ఎన్నారైలందరూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందే అని పట్టుబట్టారు. పలువురు ఎన్నారైలు అమరావతి తరలింపును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోమటి జయరాంతో పాటు శ్యామల, విలేఖ్య, చేతన తదితరులు మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలని డిమాండ్ చేశారు. వెంకట్ కోగంటి మాట్లాడుతూ.. భావితరాల కోసం సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వారు నినదించారు. వందలాది మంది ఎన్నారైలు ప్లకార్డులతో అమరావతికి మద్దతు పలుకుతూ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సమావేశంలో జయరాం కోమటి, వెంకట్ కోగంటి, శ్యామల, విజయ గుమ్మడి, గాంధీ పాపినేని, రాజా కొల్లి, సాయి నూతక్కి, మల్లిక్ వేదగిరి, శివ ప్రసాద్ వోలేటి, వెంకట్ కేతినేని, ఎం.వీ.రావు, ప్రసాద్ మంగిన, వీరు ఉప్పల, జయప్రసాద్ వేజెండ్ల, భక్త బల్లా, రజని కాకర్ల, రామ్ తోట, కోనేరు శ్రీకాంత్, శ్రీని వల్లూరిపల్లి, సతీష్ కొండెపాటి, భాస్కర్ వల్లభనేని, హేమంత్, శ్రీకాంత్ దొడ్డపనేని, బాబు పత్తిపాటి, గోకుల్, భరత్ ముప్పిరాల, సతీష్ బొర్రా, చేతన, శిరీష, యశ్వంత్ కుదరవల్లి, రెడ్డయ్య, రమేష్, శ్రీనివాస్ పోతినేని పాల్గొని మాట్లాడారు.