NRI-TDP-meet-and-greet-in-NewJersey

న్యూ జెర్సీలో ఎన్నారై టీడీపీ మీట్ అండ్ గ్రీట్

(‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి) 

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో టీడీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న టీడీపీ మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు హాజరయ్యారు. ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్న మాజీ మంత్రులతో స్థానిక ఎన్నారై టీడీపీ నేతలు, కార్యకర్తలు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు  రవీంద్ర మాట్లాడుతూ.. ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలకు అధైర్యపడవద్దని, భవిష్యత్తు తమదేనని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. తెదేపా పార్టీని పటిష్టం చేసేందుకు ప్రవాస తెలుగు వారు చేస్తున్న కృషిని మరో నేత నక్కా ఆనందబాబు ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని వచ్చే ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవాస తెదేపా కార్యకర్తలు మాజీ మంత్రులను సత్కరించారు. నాట్స్ మాజీ అద్యక్షుడు, ప్రవాస తెదేపా నాయకుడు మన్నవ మోహనకృష్ణ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గుంటూరు మిర్చియార్డు మాజీ  చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.