NATS-Economic-Literary-Seminar-in-Tempa

టెంపాలో ఘనంగా నాట్స్ ఆర్థిక అక్షరాస్యతా సదస్సు

  • ఆర్థికాంశాలపై అవగాహన కల్పించిన నాట్స్
టెంపా, ఫ్లోరిడా:  అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలో ఆర్థిక అక్షరాస్యతా సదస్సు నిర్వహించింది. ఆర్థికాంశాలపై అవగాహన కల్పించేందుకు న్యూ టెంపా రీజనల్ లైబ్రరీలో ఈ సదస్సు ఏర్పాటు చేసింది. ప్రముఖ ఆర్థిక నిపుణులు శ్రీథర్ గౌరవెల్లి ఈ సదస్సుకు విచ్చేసి తన విలువైన సూచనలు, సలహాలు అందించారు. దాదాపు 70 మందికిపైగా తెలుగువారు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఉన్నతవిద్యకు ఎలా నిధులు పొందాలి..? అమెరికాలో ఏ రిస్క్‌కు ఎలాంటి బీమా ఉంటుంది..? ట్యాక్స్ ప్రణాళికలో ఎలాంటి వ్యూహాలు ఉండాలి..? గృహాలు, ఎస్టేట్‌లు కొనడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..? ఆరోగ్య సంరక్షణకు ఎలా మనీ ప్లాన్ చేసుకోవాలి..?  సంపాదించే డబ్బును చక్కటి ప్రణాళికతో దేనికెంత ఖర్చు చేయాలి..? పొదుపు ఎలా చేసుకోవాలి..? ఇలాంటి అనేక అంశాలపై శ్రీథర్ గౌరవెల్లి చక్కటి అవగాహనను కల్పించారు. ఈ సదస్సుకు  వచ్చిన వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు. ఆర్థికంగా వారు ఎలా ప్రగతి సాధించాలనే అంశాలపై కూడా సలహాలిచ్చారు. టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్థానిక తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. నాట్స్ ఆర్థిక సదస్సు ద్వారా ఎన్నో విలువైన విషయాలను తెలుసుకున్నామని ఈ సదస్సుకు విచ్చేసిన వారు ప్రశంసించారు. రాజేశ్ కండ్రు, వంశీలతో పాటు పలువురు నాట్స్ సభ్యులు, వలంటీర్లు ఈ సదస్సు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.