Naked-toddler-in-IHOP-parking-lot-leads-to-arrest-of-Florida-couple-passed-out-in-van

తొమ్మిది నెలల కవలలను కారులో పెట్టి.. భార్యభర్తలిద్దరూ డ్రగ్స్ మత్తులో..

ఫ్లోరిడా: డ్రగ్స్ మత్తులో తొమ్మిది నెలల కవలలను పట్టించుకోకుండా కారులో వదిలేసిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లోరిడాలోని ఐహెచ్‌ఓపీ అనే రెస్టరెంట్ పార్కింగ్‌లో ఓ కారు పార్క్ చేసి ఉండగా.. షాపు తీయడానికి వచ్చిన ఉద్యోగులు కారు దగ్గర చిన్న పిల్లోడు బట్టలు లేకుండా తిరుగుతుండటం గమనించారు. వెంటనే పిల్లోడు దగ్గరకు వెళ్లగా.. పిల్లోడు కారును చూపించాడు. కారులో భార్యభర్తలిద్దరూ డ్రగ్స్ మత్తులో కనీసం ప్రపంచం కూడా తెలియని విధంగా పడి ఉన్నారు. వెనుక సీట్లో ఇద్దరు శిశువులు కనిపించడంతో వెంటనే వారిని బయటికి తీశారు. పోలీసులకు సమాచారం అందించగా.. పిల్లలకు చికిత్స అందించి మత్తు వదిలిన తరువాత భార్యభర్తలిద్దరినీ అరెస్ట్ చేశారు. భార్యభర్తలిద్దరూ ఒహియోకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారులో దొరికిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పిల్లలను పట్టించుకోకుండా వదిలేసినందుకు వారిపై కేసు నమోదు చేశారు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.