Missouri-Man-Forced-to-Drink-Toilet-Water-to-his-Pregnant-Girlfriend

గర్ల్‌ఫ్రెండ్‌ను గర్భిణీ అని కూడా చూడకుండా.. ప్రియుడు చేసిన నీచమిది..

మిస్సోరి: అమెరికాలోని మిస్సోరిలో నిండు గర్భిణీ పట్ల ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. గర్భవతి అయిన ప్రియురాలిని టాయిలెట్‌ నీరు తాగాలని వేధించాడు ప్రియుడు. తనపై జరిగిన దాడి గురించి బాధితురాలు తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌కు చెందిన ఓ మహిళ(20) సెయింట్‌ పిటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ప్రియుడు రోన్నీవిలియం హొవర్డ్‌(40) కలిసి నివాసముంటుంది. అయితే, రోన్నీవిలియం ఉన్నట్టుండి బుధవారం గర్భవతి అయిన ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టాడు. అనంతరం ఆమెను కిందపడేసి టాయిలెట్‌ నీళ్లు తాగించేందుకు ప్రయత్నించాడు. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రోన్నీవిలియంను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గర్భవతి అయిన గర్ల్‌ఫ్రెండ్‌ను వేధించినందుకు అతడికి రూ. 2,15,37,780 జరిమానా విధించి కటకటాల్లోకి నెట్టారు.