Miami-man-charged-with-murdering-his-father-on-Fathers-Day

ఫాదర్స్‌డే రోజే.. తండ్రిని చంపిన ఫ్లోరిడా వాసి

ఫ్లోరిడా: అమెరికాలో ఓ వ్యక్తి ఫాదర్స్ డేనే కన్నతండ్రిని హతమార్చాడు. ఫ్లోరిడాలోని మియామి నగరానికి చెందిన మార్కస్ సేకర్స్(32) అనే వ్యక్తికి, తన తండ్రి ఫెడెల్ పీక్(60)కు మధ్య ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ మరింత పెద్దది కావడంతో మార్కస్ తుపాకీ తీసి తన తండ్రిని అతికిరాతకంగా చంపాడు. తుపాకీ చప్పుడు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని గొడవను ఆపడానికి ప్రయత్నించారు. ‘కన్న తండ్రినే తుపాకీతో కాల్చావా..’ అంటూ పీక్ చివరిగా మార్కస్‌తో అని చనిపోయినట్టు పోలీసులకు తెలిపారు. హత్య జరిగిన ఏడు గంటల తరువాత ఓ ఇంటి బయట మార్కస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.