Mexican-have-used-Bull-Viagra..-After-That

పశువులకు వాడే వయాగ్రా.. పొరపాటున అతడు వేసుకోవడంతో..

న్యూయార్క్: మగ వారి లైగింక సామర్థ్యాన్ని పెంచేందుకు మార్కెట్లో రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్ల సూచన ప్రకారం వాడుతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం.. పశువుల లైగింక సామర్థ్యం పెంచే వయాగ్రాను తీసుకుని ఆసుపత్రిపాలైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని మెక్సికోకు చెందిన ఎలక్ట్రీషియన్ నాట్ థిండ్ (26), ఓ 30 ఏళ్ల మహిళను కలవడం ఏర్పాట్లన్ని పూర్తి చేసుకున్నాడు. లైంగిక సామర్థ్యం పెంచుకోవడం కోసం గత వేసవికాలంలో పశువులకు ఉపయోగించే వయాగ్రాను కొనుగోలు చేశాడు. అదే అతని కొంప ముంచింది. 

 

పురుషాంగం పరిమాణంలో అసాధారణ రీతిలో మార్పు వచ్చి, నొప్పి రావడంతో అతను డాక్టర్లను సంప్రందించాడు. దీంతో నాట్ థిండ్‌ పురుషాంగానికి డాక్టర్లు ఆపరేషన్ చేసి దాన్ని మామూలు స్థితికి తీసుకొచ్చారు. అయితే డాక్టర్లు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది. దీంతో దాదాపు మూడు రోజులు తలలు పట్టుకున్న డాక్టర్లు.. మొత్తానికి అతణ్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఈ నేపథ్యంలో స్పందించిన నాట్ థిండ్.. గతంలో కూడా వాటిని ఉపయోగించినట్లు వెల్లడించాడు. అయితే ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదని వాపోయాడు. ‘జరిగిందంతా చూసి నాకు నవ్వొస్తోంది. నా శృంగార జీవితం ఇంతకుముందు బాగుండేది.. కానీ ఇకపై అలా సాధ్యం కాదని నాకు తెలుసు..’ అని నాట్ థిండ్ చెప్పుకొచ్చాడు..