Man-Killed-By-Dangerous-Bird-He-Kept-On-His-Farm

ప్రమాదమని తెలిసి కూడా ఆ పక్షిని పెంచుకున్న ఫ్లోరిడా వాసి.. చివరకు..

ఫ్లోరిడా: క్యాసొవరీ అనే ప్రమాదకరమైన పక్షి చేతిలో అమెరికా వాసి ప్రాణాలు కోల్పోయాడు. ఆస్ట్రేలియా, న్యూ గినియా దేశాల్లో క్యాసొవరీ పక్షులు ఎక్కువగా ఉంటాయి. ఫ్లోరిడాకు చెందిన మార్విన్ హాజొస్(75) అనే వ్యక్తి ఈ పక్షి ప్రమాదకరమైనదని తెలిసి కూడా ఆస్ట్రేలియా నుంచి తెప్పించుకుని పెంచుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం మార్విన్‌ను ఇదే పక్షి చంపేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ పక్షి కాళ్లు చాలా ప్రమాదకరమైనవని.. వాటితో కాని దాడి చేస్తే ప్రాణాలు పోవడమో లేదా ఆసుపత్రిలో చేరడమో ఖాయమని వాషింగ్టన్ జూ అధికారులు చెబుతున్నారు. తమ జూలో కూడా ఇలాంటి పక్షులు ఉన్నాయని.. ఆ పక్షి దగ్గరకు వెళ్లాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదం అని తెలిసి ఇలాంటి పక్షులను ఎలా పెంచుకుంటున్నారో తమకు అర్థం కావడం లేదని జూ అధికారులు వాపోయారు. కాగా, ఈ పక్షి పండ్లను తిని బతుకుతుంటాయి. ఆస్ట్రేలియా అడవుల్లో ఈ పక్షులు ఎక్కువగా ఉంటాయని, అప్పుడప్పుడు రోడ్లపైకి వచ్చి మనుషులను కూడా భయపెడుతుంటాయని చెబుతున్నారు.