Man-charged-after-video-camera-found-in-bathroom-of-flight-from-California-to-Texas

విమానం బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. బ్లూ లైట్‌ను చూసి అవాక్కైన ప్యాసింజర్

శాండిగో: విమానంలో సీక్రెట్ కెమెరాను అమర్చిన ఓ వ్యక్తిని ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని శాండిగో నుంచి హూస్టన్ వెళ్లిన విమానంలో ఈ సంఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. మే 5న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 646 విమానంలోని బాత్‌రూంలోకి ఓ మహిళ వెళ్లింది. బాత్‌రూంలో ఓ మూల బులుగు రంగు లైట్ వెలుగుతున్నట్టు ఆమె గమనించింది. క్షుణ్ణంగా గమనించగా.. అది కెమెరా అని ఆమెకు అర్థమైంది. 

వెంటనే విమాన సిబ్బందికి ఈ విషయం తెలియజేయడంతో.. విమానం ల్యాండ్ అయిన వెంటనే.. సిబ్బంది ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ జరుపగా.. చూన్ పింగ్ లీ అనే వ్యక్తి ఈ కెమెరాను అమర్చినట్టు ఎఫ్‌బీఐ అధికారులు కనిపెట్టారు. పింగ్ లీ ఈ కెమెరాను అమర్చినట్టు తమ విచారణలో తేలిందని, కెమెరాను అమర్చి టెక్సాస్‌లో పింగ్ లీ దిగిపోయినట్టు అధికారులు చెప్పారు. కాగా, పింగ్‌ లీ చేసిన నేరానికి ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలను కోర్టు విధించనుంది.