MAN-ACCUSED-OF-HIDING-IN-WALMART-BATHROOM-STALL-FOR-3-HOURS-TO-FILM-MINOR-BOY-USING-URINAL

బాత్రూంలో మూడు గంటల పాటు ఉండి.. ఇతడు చేసిన నీచమిదీ..!

ఫ్లోరిడా: చిన్న పిల్లలు కాలకృత్యాలు తీర్చుకుంటుంటే వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తిని జాక్సన్‌విల్లే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జాక్సన్‌విల్లేలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ ఆరేళ్ల బాలుడు బాత్రూంకు వెళ్లగా.. పక్క బాత్రూం కింద నుంచి ఓ వ్యక్తి ఫోన్ పెట్టి వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు గమనించాడు. ఆ బాలుడి సోదరుడు బాత్రూంకు వెళ్లిన సమయంలో కూడా ఆ వ్యక్తి ఇలానే చేయడంతో తల్లికి ఈ విషయం చెప్పారు. వాల్‌మార్ట్ సిబ్బంది ద్వారా జరిగిన విషయాన్ని తల్లి లతాషా తెలుసుకుంది. ఆ వ్యక్తి మూడు గంటల నుంచి బాత్రూంలోనే దాక్కున్నట్టు సీసీఫుటేజ్ ద్వారా చూసినట్టు సిబ్బంది లతాషాకు తెలిపారు. 

వెంటనే స్టోర్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. అయితే పోలీసులు అక్కడకు వచ్చే సరికి ఆ వ్యక్తి తన ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసేసినట్టు అధికారులు పేర్కొన్నారు. బాత్రూంలో కళ్లు తిరిగి పడిపోయానని, అందుకే తన చేయి.. అందులో ఫోన్ పక్క బాత్రూంలో ఉన్నట్టు ఆ వ్యక్తి పోలీసులకు వివరించాడు. కింద పడిపోయినా చేతిలో ఫోన్ మాత్రం నేల మీద ఎందుకు పడలేదని పోలీసులు తిరిగి ప్రశ్నించడంతో.. ఆ వ్యక్తి కంగుతిన్నాడు. చెప్పిన సమాధానమే చెప్తూ ఉండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ వ్యక్తి ఇలాంటి పనులకు ఎందుకు పాల్పడ్డాడనే విషయం తెలియాల్సి ఉంది.