Kobe-Bryant-death-NATS-offer-heartfelt-condolences

కొబే బ్రయన్ మృతిపై నాట్స్ దిగ్భ్రాంతి

ప్రముఖ బాస్కెట్ బాల్ ఆటగాడు కొబే బ్రయన్ ఆకస్మిక మృతిపట్ల  ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఓ అత్యుత్తమ క్రీడాకారుడిని కోల్పోవటం ఎంతో బాధ కలిగించిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) పేర్కొంది. బాస్కెట్ బాల్ ప్లేయర్ గా బ్రయన్ (1978-2020) సాధించిన విజయాలు యువతరంలో ఎంతో స్ఫూర్తిని నింపాయని నాట్స్ తెలిపింది. బ్రయన్ లేని లోటు క్రీడాలోకానికి తీర్చలేనిదిగా నాట్స్ అభివర్ణించింది. బ్రయింట్ కుటుంబానికి నాట్స్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.