International-Womens-Day-Celebrations-in-Dallas

డల్లాస్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు!

తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) డల్లాస్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఇర్వింగ్‌లోని కూచిపూడి ఇండియన్ కిచెన్‌లో జరిగిన ఈ వేడుకులకు రెండు వందలకు పైగా మహిళలు హాజరయ్యారు. మహిళలు ఇంటా బయటా చేస్తున్న కృషి, మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి ఈ సమావేశంలో కొనియాడారు. ఒక అమ్మగా, భార్యగా, సోదరిగా స్త్రీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది అని పలువురు కొనియాడారు. డల్లాస్ శాఖ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ సునీత త్రిపురం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం సరదాగా సాగింది. ఉమెన్స్ కమిటీ నేషనల్ కో-ఛైర్ రూప కన్నయ్య, టాటా సంయుక్త కార్యదర్శి నీలోహిత కొత్తా, కల్చరల్ కమిటీ నేషనల్ ఛైర్ సమీరా ఇల్లెందుల, డల్లాస్ రీజనల్ కోఆర్డినేటర్లు శాంతి నూతి, దీప్తి సూర్యదేవర ఇతర సభ్యులు ఈ వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ లేక్ మేయర్ లారా హిల్ పాల్గొని భారతీయ స్త్రీ అంటే ఆమెకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో వీణా యలమంచిలి తన గాత్రంతో సభాసదులను అలరించారు. టాటా ప్రెసిడెంట్ విక్రం జంగం మాట్లాడుతూ.. మహిళలంటే తనకు ఎంతో గౌరవం అని, పూర్తి కుటుంబాన్ని తన భుజాలపై మోస్తున్న స్త్రీ మూర్తికి ఎల్లవేళలా అందరూ కృతజ్ఞత తెలపాలని కోరారు. ఈ వేడుకల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. సెల్ఫీ కాంటెస్ట్, ఫ్యాషన్ షో లాంటి వినూత్నమైన కార్యక్రమాలతో నిర్వహకులు అందరినీ ఆకట్టుకున్నారు. టాటా బోర్డు సభ్యులు మహేష్ ఆదిభట్ల, చంద్రరెడ్డి పోలీస్‌ల‌తో పాటు పవన్ గంగాధరా, శ్రీధర్ కుంభాల, శ్రీనివాస్ తుల, నిరంజన్ బూడిద, శ్రీకాంత్ రౌతు, సురేష్ పతనేని, రత్న ఉప్పాల, భవాని జొన్నలగడ్డ పాల్గొని తన సహాయసహకారాలు అందించారు.