International-award-in-USA-for-Telugu-Native

ప్రతిష్టాత్మకమైన ఏపీఎమ్‌పీ లెగసీ అవార్డును గెలుపొందిన విజయవాడ వాసి

ఆర్లాండో: విజయవాడకు చెందిన కార్తీక్ కౌతారపుకు అమెరికాలో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఏపీఎమ్‌పీ లెగసీ అవార్డు దక్కింది. ఫ్లోరిడాలోని ఆర్లాండో వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్తీక్ ఏఐ మీద ప్రెజెంటేషన్ ఇచ్చి ఈ అవార్డును గెలుపొందారు. బిడ్ అండ్ ప్రొపోజల్ కాన్(బీపీసీ) వేదికగా జరిగిన ఈ అవార్డు కార్యక్రమంలో భారత్ తరపున కార్తీక్ ఒక్కరే పాల్గొనడం విశేషం. ఈ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో తమ ఐడియాలను ప్రెజెంట్ చేయడానికై 255కు పైగా ఐడియాలు నామినేషన్‌కు వచ్చినప్పటికీ, ఓటింగ్ అండ్ క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా బీపీసీ కేవలం 40 ఐడియాలను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ 40 మందిలో స్థానం దక్కించుకున్న కార్తీక్ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌) క్యాటగిరీలో లెవరేజింగ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ పర్సువేసివ్ ప్రొపోజల్ అన్న టాపిక్‌పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రొపోజల్ మేనేజర్లు తమ నిర్ణయాలను మరింత ఆలోచనతో తీసుకోవడానికి, విన్ రేట్స్‌ను గెలుపొందడానికి ఏఐ అనేది ఎలా ఉపయోగపడుతుంది అన్న దానిపై కార్తీక్ మాట్లాడారు. కార్తీక్ ప్రెజెంటేషన్‌కు కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌ల నుంచి అభినందనలు లభించాయి. (అసోసియేషన్ ఆఫ్ ప్రొపోజల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్)ఏపీఎమ్‌పీ అవార్డును గెలుపొందడం నమ్మలేక పోతున్నానని, ఇది ఒక గౌరవంగా భావిస్తున్నానని కార్తీక్ ఆనందం వ్యక్తం చేశారు.