In-All-Beaches-Danger-Precautions-Appeared

అన్ని బీచ్‌ల వద్ద హెచ్చరికలు జారీ చేసి..

ఫ్లోరిడా: కుటుంబం అంతా కలిసి వెకెషన్ ఎంజాయ్ చేసేందుకు ఫ్లోరిడా చేరుకున్నారు. వారితోపాటు కెల్ డెవ్వి(11) అనే బాలుడు కూడా ఉన్నాడు. అందరూ కలిసి మంగళవారం సాయంత్రం స్ట్రౌట్ బీచ్‌కు వెళ్లారు. కెల్ బీచ్‌లో ఆడుకున్న తర్వాత సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే సముద్రంలో దిగి ఈత కొడుతున్న సమయంలో అతడి కాలు విపరీతంగా నొప్పి పెట్టడం మొదలైంది. సడెన్‌గా ఏం జరుగుతుందో కెల్లి అర్థం చేసుకోలేకపోయాడు. తనను రక్షించమంటూ కేకలు వేశాడు. పక్కనే ఉన్న కొంతమంది కెల్లి వెంటనే ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కెల్లి కాలి నుంచి రక్తం కారుతోంది. కెల్లిని ఏదో షార్క్(చేప) కుట్టి ఉంటుందని అతడి తల్లి జెస్సికా తెలిపింది. కెల్లి కాలిని ఓ టవల్‌తో చుట్టి తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లామని ఆమె చెబుతోంది. కెల్లి కాలికి 16 చోట్ల డాక్టర్లు కుట్లు వేశారు. ఈ సంఘటన ఒక్కసారిగా సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లేవారిని ఆందోళనకు గురిచేసింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అన్ని బీచ్‌‌ల వద్ద హెచ్చరికలు బోర్డులను ఏర్పాటు చేశారు.