IAFC-Hosted-Social-Security-Seminar-in-Dallas

డాలస్‌లో ఘనంగా ఐఏఎఫ్‌సీ సామాజిక భద్రతా సదస్సు..

డాలస్: అమెరికాలోని టెక్సాస్‌లో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో సామాజిక భద్రతా సదస్సు నిర్వహించారు. డాలస్‌లో శనివారం మధ్యాహ్నం ఈ సదస్సు ఘనంగా జరిగింది. మిషిగన్ స్టేట్ రిప్రజంటేటివ్ పద్మా కుప్ప.. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. ప్రవాసీలకు ఐఏఎఫ్‌సీ  అందజేస్తున్న సహకారాన్ని కొనియాడారు. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూరను అభినందించారు. సామాజిక భద్రతపై ఉండే రకరకాల అపోహలు, అనుమానాలు తీర్చుకోవడానికి ఇటువంటి సదస్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని మెచ్చుకున్నారు. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీకి చెందిన ఆంగీ హోక్వాంగ్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన వారి సందేహాలను ఆమె నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎఫ్‌సీ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ తాయబ్ కుందావల, ఉపాధ్యక్షులు రావు కాల్వల తదితరులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం పద్మా కుప్ప స్థానికంగా ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించారు. గాంధీ 150వ జన్మసంవత్సరం సందర్భంగా మహాత్ముడికి నివాళులర్పించారు. 

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.