Hungry-Pennsylvania-snake-rescued-after-swallowing-almost-half-of-own-body

ఆ పాముకు ఆకలేసింది.. తన శరీరాన్నే మింగేస్తోంది.. చివరకు.. (వీడియో)

పెన్సిల్‌వేనియా: ఒక పాము వేరే పామును మింగేసిందనే వార్తలను ఇప్పటివరకు అనేక సార్లు విన్నాం. కానీ, ఒక పాము తనను తానే మింగటం అనే వార్తను ఎక్కడైనా వినడం కానీ చూడటం కానీ చేశారా? అమెరికాలో ఇదే జరిగింది. పెన్సిల్‌వేనియాలోని ఓ పాముల శరణ్యంలో ఒక పాముకు ఆకలేసి తనను తానే సగం మింగేసింది. అదే పాముల శరణ్యంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి దీన్ని చూడటంతో వెంటనే ఆ పామును అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. చాలా సేపు ఆ పాము ముక్కుపై కొడితే కానీ అది నోట్లోకి తీసుకున్న భాగాన్ని బయటకు వదల్లేదు. సహజంగా ఈ జాతికి చెందిన పాములు అనేక ప్రమాదకరమైన పాములను సైతం మింగేస్తాయని ఆ ఉద్యోగి చెప్పాడు. ఆ పాము తనను తానే మింగేస్తున్నాననే విషయం తనకు కూడా తెలీకుండా మింగేస్తోందని అన్నాడు. ఏదో పాము తోక కనిపించిందని, అందుకే ఆ పాము మింగుతూ వచ్చేసిందని తెలిపాడు. కాగా, పాముకు సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా.. ఈ వీడియోను చూసిన అతడి స్నేహితులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.                                                                           

(వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి)