Haritaharam-celebrated-in-USA

ఎంపీ సంతోష్ ఛాలెంజ్‌ చేపట్టిన టీఆర్ఎస్ ఎన్నారై..

న్యూయార్క్: తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అమెరికాలో  మూడు మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం కొనసాగుతున్న తీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మహేష్ మాట్లాడుతూ.. ‘హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం వేగంగా ప్రంపంచమంతా విస్తరిస్తుంది. అనేకమంది ప్రముఖులు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఆకు పచ్చని తెలంగాణ కోసం మేము సైతం అంటున్నారు’ అని అన్నారు. తాము అమెరికాలో మొక్కలు నాటితే  తెలంగాణలో ఉన్న ప్రజలు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేష్‌తో పాటు టీఆర్ఎస్ అమెరికా నాయకులైన శ్రీనివాస్ గనగోని, దేవేందర్ నల్లమాడ, శ్రీనివాస్ మలై, వెంకట్ గజ్జల పాల్గొన్నారు.

టీఆర్ఎస్ అమెరికా నాయకులు మహేష్ తన్నీరు, యూకే టీఆర్ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనిల్ కూర్మాచలం, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ కాసర్ల నాగేందర్ రెడ్డి, న్యూజిలాండ్  టీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ విజయ్ కొసన, టీఆర్ఎస్ డెన్మార్క్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్యామ్ బాబు ఆకుల, టీఆర్ఎస్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాదారపు సతీష్, టీఆర్ఎస్ సౌతాఫ్రికా ప్రెసిడెంట్ నాగరాజు గుర్రాల తెలంగాణ వాసులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.