Giant-lizard-found-in-toilet-bowl

బాత్రూం సింక్‌లో కనిపించిన దాన్ని చూసి.. అంతా షాక్..

ఫ్లోరిడా: ఓ వ్యక్తి టాయిలెట్‌కు వెళ్లాడు. అంతకంటే ముందు అతడు టాయిలెట్ సీటును ఎత్తాడు. ఒక్కసారిగా టాయిలెట్ వైపు చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. ఇంతకీ టాయిలెట్‌లో అతడికి ఏం కనబడిందంటే ఓ పెద్ద బల్లి టాయిలెట్‌ సింక్‌లో తిరుగుతోంది. దాన్ని ఎలా బయటకు తీయాలో తెలియక తాను అధికారులకు సమాచారం అందించానని అతడు తెలిపాడు. కొద్దిసేపట్లోనే అధికారులు ఆ ఇంటికి చేరుకున్నారు. టాయిలెట్ సింక్‌లో దాక్కున్న బల్లిని జాగ్రత్తగా బయటకు తీశారు. దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ సంఘటన దక్షిణ ఫ్లోరిడాలో జరిగింది. అయితే బల్లి అధికారులు బయటకు తీసిన దృశ్యాలను వీడియో తీశారు. ఆ వీడియోను తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టాయిలెట్‌ సీటు ఎత్తగానే ఒక్కసారి దాని వైపు చూడండి అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.