GCTA-Bonalu-and-Famili-Picninc-2019-to-be-held-in-Ohio

గ్రేటర్ సిన్సినాటి తెలంగాణ అసోసియేషన్ బోనాల సంబరం..

సిన్సినాటి: అమెరికాలోని ఒహియోలో బోనాల పండుగ నిర్వహించనున్నట్లు గ్రేటర్ సిన్సినాటి తెలంగాణ అసోసియేషన్(జీసీటీఏ) వెల్లడించింది. ఈ కార్యక్రమంలో స్థానిక తెలంగాణ వాసులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. జూలై 28న మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం మొదలవనుంది. తెలంగాణ సంప్రదాయ పండుగైన బోనాలను జరుపుకోవడం ద్వారా తెలంగాణ వాసులందరినీ దగ్గర చేయవచ్చని, అందుకే గ్రేటర్ సిన్సినాటి తెలంగాణ అసోసియేషన్(జీసీటీఏ) ఈ అవకాశాన్ని ఉపయోగింకుంటోందని జీసీటీఏ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ తెలంగాణ సంప్రదాయ రుచులతో భోజనాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.