Florida-woman-pulls-foot-long-alligator-out-of-yoga-pants-during-traffic-stop

యువతి ప్యాంటులో మొసలి.. షాక్‌లో పోలీసులు

ఫ్లోరిడా: ప్యాంటులో మొసలిని దాచుకుని వెళ్తున్న ఫ్లోరిడా యువతిని చూసి పోలీసులు షాకయ్యారు. ట్రాఫిక్ చెకింగ్‌లో భాగంగా పుంటా గోర్డా ప్రాంతంలో పోలీసులు ఓ ట్రక్కును ఆపగా.. అందులో ఏరియల్ మైకెల్ అనే యువతి, మైకెల్ కోడీ క్లెమన్స్ అనే వ్యక్తి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని పోలీసులు ప్రశ్నించగా.. తాము కప్పలను, పాములను పట్టడానికి వెళ్తున్నట్టు పోలీసులకు తెలిపారు. ట్రక్కును సోదా చేసిన అనంతరం పోలీసులు వారి బ్యాగులను కూడా సోదా చేశారు. యువతి బ్యాగును పరిశీలించగా.. అందులో నలభై త్రీ స్ట్రైప్డ్ తాబేళ్ల పిల్లలు ఉన్నాయి. వారి దగ్గర మరిన్ని ఉన్నాయని సందేహపడిన పోలీసులు వారిద్దరిని కిందకు దిగాల్సిందిగా కోరారు. ఇంకేమైనా తీసుకొని వెళ్తున్నారా అని యువతిని ప్రశ్నించగా.. వెంటనే ఆమె ప్యాంటులో నుంచి మొసలిని తీసింది. మొసలిని చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌కు ఈ కేసును అప్పగించారు.